వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక వ్యక్తిగా మొదలై కాంగ్రెస్ పార్టీని ఎదురించినందుకు అనేక అక్రమ కేసులూ, నిర్బంధాలు ఎదుర్కొని అన్నిటినీ చిరునవ్వుతో ఎదుర్కుని గత పదేళ్ళుగా పోరాడి ఒకశక్తిగా ఎదిగారు. ఒక వ్యవస్థను రూపొందించారు. ఈ ఘటనపై తాజాగా అసెంబ్లీలొ మరోసారి మంత్రి కొడాలి విమర్శించారు. ఈ సందర్భంగా కొడాలి నాని మాట్లాడుతూ నిన్న చంద్రబాబు అసెంబ్లీలో అంటాడు.. ఈనాడు పేపర్ 1978లో పెట్టారు.. 1983లో మేము టీడీపీని స్థాపించామని. 1983కి చంద్రబాబు కాంగ్రెస్ లో ఉన్నాడు.. కాంగ్రెస్ తరపున చంద్రగిరిలో పోటీచేసి ఓడిపోయిన చంద్రబాబు ఓడిపోయిన వారం తిరగక ముందే మామ పంచన చేరాడు.. అప్పటినుండి మామకు మొదలైంది వెన్నుపోటు అన్నారు. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టినపుడు ఈనాడు పేపర్‌మీద ఆధారపడలేదన్నారు.
60వేల సర్క్యులేషన్ ఉన్న ఈనాడు పేపర్ 3లక్షలకు వచ్చింది. ఎన్టీఆర్ ఈనాడుకు ఉపయోగపడ్డాడు కానీ, ఈనాడు ఎన్టీఆర్‌కు ఉపయోగపడలేదన్నారు. ఎన్టీఆర్ ని ఒక స్త్రీ లోలుడిగా, పాలన చేతగాని అసమర్ధునిగా రామోజీ సహాయంతో చంద్రబాబు చిత్రీకరించి వ్యంగ్యమైన కార్టూన్లతో అసత్య కధనాలతో ఆయన ప్రతిష్టను మంటగలిపారు. చివరికి కన్న కొడుకులను కూడా ఆయనకు దూరంచేసి అత్యంత కిరాతకంగా ఎన్టీఆర్ ని చంద్రబాబు గద్దె దించాడు. చంద్రబాబు వెనుక 10మంది ఎమ్మెల్యేలు కూడా లేకుండా వైశ్రాయ్ హోటల్‌లో 165మంది ఎమ్మెల్యేలు ఉన్నారని ఈనాడులో రాయించుకున్నాడన్నారు. ఈనాడు సంస్థలో చంద్రబాబు ఓ ఉద్యోగి.. తప్పుడు పనులు చేయడానికి ఎన్టీఆర్ ఉపయోగపడ్డారని తెలిసి ఇటువంటి సంస్థలన్నీ కూడా కలిసి చంద్రబాబును ఉద్యోగిగా పెట్టుకున్నాయన్నారు. టీడీపీ అనే వ్యవస్థలోకి దూరి పందికొక్కులా నాశనం చేసిన వ్యక్తి చంద్రబాబు అని కొడాలినాని విమర్శలు గుప్పించారు.