బాలీవుడ్ అందాల రాక్షసి.. హాట్ బ్యూటీ సోనాక్షి సిన్హా సంచలన వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్ స్టార్ దర్శకుడు బోయపాటి శ్రీను సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ హీరోగా బాలయ్య ది 105మూవీ తెరకెక్కుతున్న సంగతి విదితమే. అయితే ఈ మూవీలో ఈ బ్యూటీ నటించనున్నది అని వార్తలు టాలీవుడ్ లో చక్కర్లు కొట్టాయి. అయితే తనపై వస్తున్న వార్తలపై ఈ బ్యూటీ ట్విట్టర్లో స్పందించింది. ఈ సందర్భంగా సోనాక్షి సిన్హా తన ట్విట్టర్లో స్పందిస్తూ” టాలీవుడ్ హీరో బాలకృష్ణతో నేను నటించనున్ననా..?. నేనా.. అతనితోనా..? అంటూ బాలయ్యతో నటిస్తున్నాని వస్తున్న వార్తల్లో ఎంతవరకు నిజం లేదు . నేను చేయబోయే కొత్త మూవీకి చెందిన విషయాలను త్వరలోనే వివరిస్తానని”ఈ ముద్దుగుమ్మ వెల్లడించింది.
