ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘దిశ’ చట్టంపై సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా కృష్ణా జిల్లాలో దేవినేని ఆవినాష్ ఆధ్వర్యంలో సీఎం వైఎస్ జగన్‌చిత్రపటానికి మహిళలు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆవినాష్ మాట్లాడుతూ.. ‘దిశ’ చట్టం తేవడంతో మహిళలకు జగన్ ఒక ధైర్యంగా మారారని అన్నారు. ఇది మహిళలకు రక్షణ కవచంలా కొండంత అండగా ఉంటుందన్నారు. యావత్ దేశానికే ఈ చట్టం ఆదర్శమని అన్నారు. టీడీపీ హయాంలో కాల్‌మనీ సెక్స్ రాకెట్ పేరుతో మహిళలనుహింసించారని.కాని ఇప్పుడు మహిళల భదత్ర కోసం జగన్ తెచ్చిన చట్టం పై మహిళలు రుణపడి ఉంటారని దేవినేని ఆవినాష్ చెప్పారు.
