చేపాక్ వేదికగా టీమిండియా, వెస్టిండీస్ మధ్య మొదటి మ్యాచ్ ప్రారంభం అయింది. అయితే ముందుగా టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకుంది వెస్టిండీస్. దాంతో బ్యాట్టింగ్ కి వచ్చిన భారత్ కి చేదు అనుభవం ఎదురయింది. టాప్ ఆర్డర్ మొత్తం కుప్పకూలింది. రోహిత్, రాహుల్, కోహ్లి చేతులెత్తేశారు. విండీస్ బౌలర్స్ ధాటికి వెనుదిరిగారు. ఇప్పుడు భారం మొత్తం శ్రేయస్స్, పంత్ పైనే ఉంది. ఈ మ్యాచ్ లో గాని పంత్ అద్భుతంగా రానిస్తే అతడికి చాలా మంచిదని భావిస్తున్నారు. కాబట్టి వచ్చిన అవకాశాన్ని పంత్ వినుయోగించుకోవాలి.
