90ML హీరో కార్తికేయ జాక్పోట్ కొట్టాడని చెప్పాలి. ఎందుకంటే ఈ యువ హీరో గీత ఆర్ట్స్ తో జతకట్టబోతున్నాడు. ఈ సినిమాకు గాను డెబ్యు డైరెక్టర్ కౌశిక్ దర్శకత్వం వహించనున్నాడు. తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం ఈ చిత్రానికి గాను ‘చావు కబురు చల్లగా’ అనే టైటిల్ పెట్టారు. ఈ చిత్రం యొక్క రెగ్యులర్ షూట్ త్వరలో ప్రారంభమవుతుంది. ప్రస్తుతం చిత్ర యూనిట్ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. మెగా నిర్మాత అల్లు అరవింద్ దీనిని ప్రదర్శించనున్నారు మరియు దీనిని గీతా ఆర్ట్స్ 2 పతాకంపై బన్నీ వాస్ బ్యాంక్రోల్ చేస్తారు. ఈ మాస్ ఎంటర్టైనర్లో కార్తికేయ బస్తీ బాలరాజు పాత్రను పోషిస్తున్నాడు.
