టీమిండియా కెప్టెన్ ,పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ.. టీమిండియా ఫ్యూచర్ కెప్టెన్ రోహిత్ శర్మ నువ్వా నేనా అంటూ తెగ పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ మరో రికార్డుకు చేరువలో ఉన్నాడు.
అతడికి పోటీగా రోహిత్ శర్మ ఉన్నాడు. 2011,17,18సంవత్సరాల్లో వన్డేల్లో కోహ్లీ అత్యధిక పరుగులను సాధించి నెంబర్ వన్ ప్లేస్లో ఉన్నాడు. ఈ ఏడాది కూడా కోహ్లీ 1288పరుగులతో నెంబర్ వన్ స్థానంలో ఉన్నాడు. అయితే రోహిత్ శర్మ 1232పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు.
అయితే ఈ రోజు జరగనున్న మ్యాచ్ లో రోహిత్ యాబై పరుగులను సాధిస్తే విరాట్ ను సమం చేస్తాడు. మరి ఇది సాధిస్తాడా..? లేదా విరాట్ ఇంకా ఎక్కువ పరుగులు చేసి టాప్ ప్లేస్లో ఉంటాడా అనేది సర్వత్రా ఆసక్తి నెలకొన్నది.