ఏపీ ప్రస్తుత ముఖ్యమంత్రి,అధికార వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి… మాజీ ముఖ్యమంత్రి ,ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నువ్వా.. నేనా అంటూ పోటీ పడుతున్నారు. వీరిద్ధరి మధ్య గూగుల్ ,ట్విట్టర్ లో పోటీ నెలకొన్నది.
ఈ ఏడాది గూగుల్ ఎక్కువమంది వెతికిన ఏపీ రాజకీయ నాయకుడిగా వైసీపీ అధినేత,ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నిలిచారు. ఆయన తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుల గురించి నెటిజన్లు నిలిచారు.
రాజకీయ నేతల స్పీచ్ లతోపాటు ఆయా పార్టీల పాటలను ఎక్కువమంది వెతికారు. వైసీపీ రావాలి జగన్,కావాలి జగన్ పాటను చాలా మంది గూగుల్ లో వెతికారు. అటు ట్విట్టర్లో ,ఎఫ్బీలో చంద్రబాబుకు ఎక్కువమంది ఫాలోవర్లు ఉన్నారు.