టీమిండియాకు చెందిన మాజీ ఫాస్ట్ బౌలర్ .. సీనియర్ మాజీ క్రికెటర్ తప్ప తాగి వీరంగం సృష్టించిన సంఘటన వెలుగులోకి వచ్చింది. టీమిండియా తరపున ఆడిన మాజీ క్రికెటర్ ప్రవీణ్ కుమార్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మీరట్ దగ్గర తాగేసి వీరంగం సృష్టించిన వార్త సంచలనం సృష్టిస్తుంది.
ప్రవీణ్ ఇంటి పక్కన ఉండే దీపక్ శర్మ తన తనయుడితో కల్సి ఒక బస్ స్టాప్ దగ్గర బస్సు కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ క్రమంలో ఫుల్ త్రాగి అటువైపే వచ్చాడు కారులో ప్రవీణ్ కుమార్. కారు దిగి ముందుగా అక్కడకి ఆ సమయంలో వచ్చిన బస్సు డ్రైవర్ను చెడమడ తిట్టి ఆ తర్వాత బస్సు డ్రైవర్ పై తన ప్రతాపం చూపించాడు.
ఈ క్రమంలోనే పక్కనే ఉన్న దీపక్ శర్మ తనయుడ్ని కూడా ప్రవీణ్ కుమార్ పక్కకు నెట్టేసి బండ బూతులు తిట్టారు. ప్రస్తుతం ఈ వార్త యూపీలో తెగ వైరల్ అవుతుంది.