గత ఐదేళ్లలో చంద్రబాబు అవినీతిలో భాగమైన ఓ కీలక అధికారిని జగన్ సర్కార్ సస్పెండ్ చేసింది. దీంతో చంద్రబాబు అగ్గిలం మీద గుగ్గిలం అవుతున్నాడు. చంద్రబాబు హయాంలో కేంద్రం నుంచి డిప్యుటేషన్‌గా వచ్చిన ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణ కిషోర్‌ని నాటి ప్రభుత్వం ఎకనమిక్ డెవలప్‌మెంట్ బోర్డ్ సీఈవోగా నియమించింది. బాబు, లోకేష్‌ల అండ చూసుకుని సదరు అధికారి అడ్డగోలుగా భూకేటాయింపులు, నిధుల దుర్వినియోగం, ఉద్యోగ నియామకాలతో సహా అనేక అవినీతిపనులకు కేంద్ర బిందువుగా మారాడు. అయితే తాజాగా పరిశ్రమలు, మౌలిక వసతులశాఖ నుంచి నివేదిక తెప్పించుకున్న జగన్ సర్కార్ సదరు అధికారిని అవినీతి ఆరోపణలపై సస్పెండ్ చేసి, విచారణ చేపట్టాలని సీఐడీ, ఏసీబీ డీజీలను ఆదేశించింది. అంతే కాదు ఆ విచారణ 6 నెలల్లో పూర్తి చేయాలని…డెడ్ లైన్ విధించింది. విచారణ పూర్తయ్యే వరకు కృష్ణ కిశోర్‌ను అమరావతి విడిచి వెళ్లొద్దని ఆదేశించింది. జాస్తి కృష్ణ కిషోర్ సస్పెన్షన్‌పై టీడీసీ అధినేత చంద్రబాబు తీవ్రంగా స్పందించాడు. కేంద్రం నుంచి డిప్యుటేషన్‌పై వచ్చిన అధికారిని సస్పెండ్ చేసే అధికారం జగన్‌కు లేదని చంద్రబాబు గగ్గోలు పెట్టాడు. అధికారులపై ప్రభుత్వం కక్షసాధింపులకు పాల్పడుతుందంటూ ఆరోపించాడు. ఒక అధికారిని అవినీతి ఆరోపణలపై సస్పెండ్ చేస్తే చంద్రబాబు ఎందుకు ఉలిక్కిపడుతున్నాడనే సందేహంగా మారింది. తాజాగా ఈ జాస్తి కిషోర్‌కు చంద్రబాబుకు ఉన్న సన్నిహిత సంబంధాలు ఇప్పుడు బయటపడుతున్నాయి. అప్పట్లో వైజాగ్ సమ్మిట్‌ల పేరుతో జరిగిన ఎంవోయుల బాగోతాలకు కర్మ కర్త క్రియ ఈ అధికారే కావడం గమనార్హం. ఎంవోయూల పేరుతో చిన్నా, చితకా సూట్‌కేసు కంపెనీలకు బాబు సర్కార్ ప్రభుత్వ స్థలాలను, కారుచౌకకు కట్టబెట్టి పెద్ద ఎత్తున కమీషన్లు కొట్టేసినట్లు సమాచారం. ఈ బాగోతంలో జాస్తి పాత్ర కూడా తెలుస్తోంది. అలాగే ఈడీబీ సీఈవోగా జాస్తి పెద్ద ఎత్తున నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఓటుకు నోటు కేసు తర్వాత చంద్రబాబుతో సహా ప్రభుత్వ యంత్రాంగమంతా ఏపీకి తరలివచ్చినా..జాస్తి టీమ్ మాత్రం హైదరాబాద్‌లోనే లేకవ్యూ గెస్ట్‌హౌస్ నుండే అవినీతి దందాలు సాగించినట్లు సమాచారం. ఒక్క రాత్రి జాస్తి బృందం 9 మంది గెస్టులకు గ్రాండ్ కాకతీయలో డిన్నర్ ఇస్తే అయిన ఖర్చు 14 లక్షలు..ఇలా ప్రభుత్వ నిధులను సొంతానికి వాడుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి.అంతే కాదు చంద్రబాబు భజన చేసే అధికారుల్లో ఈ జాస్తి ముందువరుసలో ఉంటాడు. అయితే జగన్ సర్కార్ ఇటీవల ఈడీబీ కార్యకలాపాలపై ఓ నివేదిక తెప్పించుకుంది. దీంతో జాస్తి కృష్ణ కిశోర్ అవినీతి బాగోతాలన్నీ బయటపడడంతో ప్రభుత్వం వెంటనే ఆయన్ని సస్పెండ్ చేసి, సీఐడీ, ఏసీబీ విచారణకు ఆదేశించింది. దీంతో చంద్రబాబు కల్లుతాగిన కోతిలా ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నాడు. జాస్తి విషయంలో ఇంతలా బాబు కుస్తీ పడుతున్నాడంటే..లోపల ఏదో అవినీతి బాగోతం ఉండే ఉంటుంది. తన పేరు ఎక్కడ బయటపడుతుందనే భయంతోనే చంద్రబాబు ఇంతలా గగ్గోలు పెడుతున్నాడని స్పష్టంగా అర్థమవుతుంది. మొత్తంగా ఒక ఐఆర్ఎస్ అధికారిని అవినీతి ఆరోపణలపై సస్పెండ్ చేసి విచారణకు ఆదేశించడం జగన్ సర్కార్ నిష్పక్షపాత వైఖరికి అద్దం పడుతోంది.
