జనసేన పార్టీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తీరుతో పవన్ కల్యాణ్ తీరుతో విసిగిపోతున్న నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. తాజాగా పార్టీ సిద్ధాంతకర్త రాజు రవితేజ రాజీనామా చేయగా…మరో కీలక నేత, సీబీఐ మాజీజేడీ వివి లక్ష్మీ నారాయణ కూడా రాజీనామా బాటలో ఉన్నట్లు తెలుస్తోంది. గత సార్వత్రిక ఎన్నికల ముందు తన ఉద్యోగ బాధ్యతలకు రాజీనామా చేసిన లక్ష్మీ నారాయణ తొలుత సొంత పార్టీ పెడతారని లేకపోతే టీడీపీలో చేరుతారని ఊహించారు. అయితే అనూహ్యంగా జనసేన పార్టీలో చేరారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో విశాఖ లోకసభ స్థానం నుంచి పోటీ చేసిన ఓడిపోయిన లక్ష్మీ నారాయణ అప్పటి నుంచి జనసేన పార్టీలో క్రియాశీలకంగా కనిపించడం లేదు. అధ్యక్షుడు పవన్ కల్యాణ్, లక్ష్మీ నారాయణల మధ్య విబేధాలు చోటు చేసుకున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో లక్ష్మీ నారాయణ జనసేన పార్టీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. జనసేన పార్టీలో చేరడం వల్ల తాను ఆశించిన ఫలితాలు రావడం లేదని, నిలకడలేని పవన్ తీరు వల్ల పార్టీ ఎప్పటికీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని లక్ష్మీ నారాయణ భావిస్తున్నారంట..ఇలాగే జనసేనలో కొనసాగితే రాజకీయంగా ఎదగడం కష్టమని భావిస్తున్న ఆయన బీజేపీ వైపు చూస్తున్నట్లు సమాచారం. టీడీపీ నుంచి ఆహ్వానం ఉన్నా…ఆ పార్టీలోకి వెళ్లడానికి లక్ష్మీ నారాయణకు ఇష్టం లేదంట..అందుకే ప్రత్యామ్నాయంగా బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారంట..ఈ మేరకు బీజేపీ ఎంపీ సుజనా చౌదరితో లక్ష్మీ నారాయణ టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో సుజనా తరచుగా లక్ష్మీ నారాయణతో పార్టీలో చేరే విషయంపై చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. జనసేన పార్టీలో కీలక నేతగా ఎదిగిన ఈ మాజీ సీబీఐ అధికారి త్వరలో కాషాయకండువా కప్పుకోడం ఖాయంగా కనిపిస్తుంది. మొత్తంగా మాజీ సీబీఐ అధికారి లక్ష్మీ నారాయణ పార్టీని జనసేనను వీడితే..పవన్ కల్యాణ్‌కు గట్టిషాకే అని చెప్పాలి.
