ఏపీలో అసెంబ్లీ శీతాకాల సమావేశాల సందర్భంగా ప్రతిపక్ష నేత చంద్రబాబుతో టీడీపీ ఎమ్మెల్యేలు సభను జరుగకుండా అనవసర రాద్ధాంతం చేస్తున్నారు. ప్రభుత్వం చారిత్రాత్మాక దిశ బిల్లుపై ప్రవేశపెట్టేందుకు చర్చ పెడితే..ఉల్లి ధరలపై చర్చించాలని గొడవ చేశారు. అంతే కాకుండా జీవోనెంబర్ 2430 ను వ్యతిరేకిస్తూ..ఉద్దేశపూర్వకంగా తనకు కేటాయించిన గేటు నుంచి కాకుండా ఎమ్మెల్యేల గేటు నుంచి వచ్చిన బాబు, లోకేష్‌లు తమను అడ్డుకున్న మార్షల్స్‌పై బాస్టర్డ్స్, యూజ్‌లెస్ ఫెలోస్ అంటూ నోరు పారేసుకున్నారు. ఇలా ఏదో ఒక వంకతో అసెంబ్లీ సమావేశాల్లో ప్రజల సమస్యలపై చర్చించకుండా రాజకీయ మైలేజీ కోసం బాబు అండ్ కో ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు కుటిల రాజకీయాలపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అసెంబ్లీలో చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరుపై మండిపడ్డారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఐదు రోజల శాసనసభ సమావేశాలను స్తంభింపచేయాలని ప్రయత్నాలు చేశారని, సంక్షేమ ఫలాలను ప్రజలకు చేరకుండా చేస్తున్నారని దుయ్యబట్టారు. వైఎస్సార్‌సీపీ కి ప్రజలు ఇచ్చిన 151 సీట్ల ప్రజాతీర్పును చంద్రబాబు ఓర్వలేకపోతున్నారన్నారు. ‘దిశ’ చట్టంపై చర్చ జరుపుతామంటే.. ఉల్లి ధరల గురించి రాద్ధాంతం చేయాలని చూశారని మండిపడ్డారు. ప్రజలకు ఉల్లి కొరత తీర్చేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చర్యలు చేపట్టారని.. కేజీ ఉల్లి రూ.25లకే అందుబాటులో ఉంచారని తెలిపారు. ఇంగ్లీషు విద్య, అమ్మఒడి, నాడు-నేడు, రివర్స్ టెండరింగ్.. అన్నింటిలోను చంద్రబాబు అడ్డుపడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రజా సమస్యలపై చర్చిస్తే.. చంద్రబాబు రాజకీయం చేయాలని చూస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నారని.. ఆయన పాలనలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ విధానాలను ఖూనీ చేశారన్నారు. ప్రజలు తిరస్కరించినా ఆయనలో మార్పు రాలేదన్నారు. శాసనసభలో చంద్రబాబు ప్రవర్తన భయానకంగా ఉందని మల్లాది విష్ణు ఫైర్ అయ్యారు. మొత్తంగా అసెంబ్లీలో చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరు ఏ మాత్రం హుందాగా లేదనే చెప్పాలి.
