తెలంగాణతో పాటుగా యావత్తు దేశమంతటా సంచలనం సృష్టించిన దిశ కేసులో షాకింగ్ నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. నలుగురు నిందితులు దిశను అతిదారుణంగా అత్యాచారం జరిపి.. ఆ తర్వాత చంపి.. పెట్రోల్ పోసి తగులబెట్టిన సంగతి విదితమే.
ఈ కేసును చేధించిన పోలీసులు సీన్ రీకన్ స్ట్రక్షన్ లో భాగంగా కేసును సంఘటన స్థలంలో విచారిస్తుండగా పోలీసులపై నిందితులు దాడికి దిగడంతో ఆత్మరక్షణకోసం పోలీసులు జరిపిన కాల్పుల్లో నలుగురు మృతిచెందారు.
అయితే దిశ మృతదేహాన్ని పరిశీలించిన నేపథ్యంలో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. అందులో భాగంగా దిశ లివర్‌లో లిక్కర్‌ను ఫోరెన్సిక్ నిపుణులు గుర్తించారు.
దిశ కేసులో పోలీసులకు మరో ఆధారం బలంగా మారింది. అత్యాచారం సమయంలో దిశ నోట్లో నిందితులు బలవంతంగా మద్యం పోసినట్లు గుర్తించారు.