తెలుగు జర్నలిజంలో దిగ్గజం ఈనాడు సంస్థల వ్యవస్థాపకుడు, ఈనాడు పత్రిక ఎడిటర్ రామోజీరావు ఆయన బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇటీవల 2430 ప్రకారం వార్తలను పారదర్శకంగా రాయాలని ప్రభుత్వ నిర్ణయాలపై రాష్ట్ర ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే ఏదైనా వార్త రాసినప్పుడు సంబంధిత ఎడిటర్ ఆ పత్రికకు సంబంధించిన వ్యక్తులు కచ్చితంగా బాధ్యత వహించాలని అన్నారు లేదంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. అయితే కొంతకాలంగా జగన్ గెలుపు జీర్ణించుకోలేని చంద్రబాబు అనుకూల మీడియా పత్రికలు ఆయన పై విషం కక్కుతున్నాయి. ఇందులో పేరుగాంచిన పేపర్లతో పాటు ఐదారు న్యూస్ ఛానల్ కూడా ఉన్నాయి. ఈ క్రమంలో రామోజీ రావు రాజీనామా సర్వత్రా ఆసక్తిని రేపుతోంది. ప్రభుత్వం ఏవైనా చర్యలు తీసుకోనుందా అందుకే రామోజీ తప్పుకున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
