జగన్ నిర్ణయానికి దేశమంతా అభినందనలు ఏపీ అసెంబ్లీ లో శుక్రవారం దిశ బిల్లును ఏకగ్రీవం గా ఆమోదించడం జరిగింది. తెలంగాణ లో జరిగిన దిశ అత్యాచార ఘటనకు స్పందిస్తూ మరే కోణంలోను ఇటువంటి ఘటనలు పునరావృతం కాకూడదనే ఉద్దేశంతో మహిళల రక్షణకు జగన్ తీసుకున్న ఈ నిర్ణయం పై దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నారు. దేశంలోనే మొట్టమొదటి గా స్పందిస్తూ జగన్ సర్కారు దిశ చట్టాన్ని రూపొందించింది. సంఘటన జరిగిన 21 రోజులలోపు నేరం రుజువైతే మరణ శిక్ష విధించేలా ఈ చట్టంలో కఠినమైన శిక్షలు రూపొందించారు. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన విజయసాయి రెడ్డి “ఏపీ దిశ చట్టంపై కేంద్రం సహా అన్ని రాష్ట్రాలు ఆరా తీస్తున్నాయి.మహిళలు,పసి పిల్లలపై ఘోరాలు జరిగితే ప్రచారం కోసం వాడుకోవడం తప్ప చంద్రబాబు ఏనాడు కఠిన చట్టాలు తేలేదు.ఈ యాక్ట్ వల్ల నేరగాళ్లకు 21 రోజుల్లోనే ఉరికంబం ఎక్కుతారని జగన్ గారు ఇచ్చిన భరోసా మహిళల్లో ధైర్యం నింపింది” అని అన్నారు.