ఆస్ట్రేలియా జట్టు ప్రస్తుతం సూపర్ ఫామ్ లో ఉందని చెప్పాలి. ఓపెనర్స్ డేవిడ్ వార్నర్ అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. టీ20, టెస్ట్, వన్డేలు ఇలా అన్నింటిలో తన పాత్ర ఉందని నిరుపిస్తున్నాడు. ఇక అసలు విషయానికి వస్తే మొన్న పాకిస్తాన్ ను దారుణంగా ఓడించిన విషయం తెలిసిందే. టీ20, టెస్టుల్లో కూడా పాక్ కు చుక్కలు చూపించింది. ఇప్పుడు అదే తరహాలో న్యూజిలాండ్ ను కూడా ఒక ఆట ఆడుకుంటున్నారు. ప్రస్తుతం ఇరు జట్లమధ్య టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. అందరు అనుకున్నట్టుగానే ఆస్ట్రేలియా పేసర్స్ బ్లాక్ కాప్స్ కు చుక్కలు చూపించారు. ఇదే ఫామ్ ఆస్ట్రేలియా కొనసాగిస్తే వారిని తట్టుకోవడం కష్టమే.
