గ్రేటర్ వరంగల్ 35వ డివిజన్ కడిపికొండ గ్రామంలో రాజమండ్రి బోటు ప్రమాద బాధిత కుటంబాలలో 5గురి కుటుంబాలకు టీఆర్ఎస్ పార్టీ ఇన్సూరెన్స్ 2లక్షల రూపాయల చెక్కులను వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే అరూరి రమేష్ ఇంటింటికి వెళ్లి అందజేశారు. అలాగే బోటు ప్రమాదంలో గాయపడిన వారికి ఏపీ ప్రభుత్వం ప్రకటించిన లక్ష రూపాయల చెక్కులను సైతం అందజేశారు.
బోటు ప్రమాద బాధిత కుటుంబాలకు ఇప్పటికే తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు కలిపి 15లక్షల రూపాయల చెక్కులను అందజేసినట్లు, అలాగే మరో 5 కుటుంబాలకు లెబర్ ఇన్సూరెన్స్ 6లక్షల 30వేల రూపాయల చెక్కులను వారికి అందజేసినట్లు తెలిపారు. ఏదీ ఏమైనా ఇలాంటి సంఘటనలు జరగడం చాలా దురదృష్టకరమని ఎమ్మల్యే అరూరి రమేష్ అన్నారు.
బాధిత కుటుంబాలకు ఎళ్లావేలలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉండే పార్టీ టీఆర్ఎస్ పార్టీ అన్నారు. ప్రభుత్వం ప్రవేశ పెట్టే సంక్షేమ పథకాలను నియోజకవర్గంలోని ప్రతీ గడపకు అందించడమే తన లక్ష్యమని తెలిపారు. తనపై నమ్మకంతో అత్యధిక మెజార్టీ ఇచ్చి గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు.