టీడీపీ హాయాంలో చంద్రబాబు, లోకేష్‌ల అండ చూసుకుని మంత్రులు, ఎమ్మెల్యేలు, చోటామోటా నేతల నుంచి అధికారుల వరకు అవినీతికి పాల్పడ్డారు. తాజాగా ముఖ్యంగా బాబు హయాంలో సీఎం పేషీ, లోకేష్ కార్యాలయం సెటిల్‌మెంట్లకు, అవినీతి దందాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారాయని అప్పట్లో విమర్శలు వచ్చాయి. తాజాగా మాజీ మంత్రి లోకేష్ వ్యక్తిగత కార్యదర్శి(పీఎస్) పలువురు నిరుద్యోగుల నుంచి ఉద్యోగాల పేరిట రూ.లక్షల్లో వసూలు చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే మచిలీపట్నానికి చెందిన కోన నాగార్జునకు.. మాజీ మంత్రి నారా లోకేష్ వద్ద వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన బొంత అర్జునరావుతో పరిచయం ఉంది. మంత్రి సిఫార్సుతో వివిధ ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మబలకడంతో కోన నాగార్జున పలువురు నిరుద్యోగులను అర్జునరావుకు పరిచయం చేశాడు. ఇలా పరిచయమైన వారితో అర్జునరావు బేరసారాలు నడిపాడు. ఏపీ జెన్‌కోలో అసిస్టెంట్ ఇంజనీర్ పోస్ట్ ఇప్పిస్తానంటూ పామర్రుకు చెందిన ఊటుకూరు పవన్‌కుమార్ దగ్గర 9 లక్షలు, బందర్ వ్యవసాయ మార్కెట్‌లో సెక్యూరిటీ గార్డు పోస్టు కోసం లంకె పోతురాజు దగ్గర నుంచి ఒకటిన్నర లక్ష, ఎక్స్ – సర్వీస్‌మెన్ కోటా కింద వ్యవసాయభూమి కోసం దరఖాస్తు చేసిన ఇంతేరు గ్రామానికి చెందిన కొల్లటి లక్ష్మీల వద్ద రూ. 5 లక్షలు మొత్తంగా 19 లక్షలవరకు అర్జున్ రావు వసూలు చేసినట్లు సమాచారం. ముందుగా డబ్బులు తీసుకున్నాక ఇదిగో ఉద్యోగం.. అదిగో ఉద్యోగం అంటూ కాలం వెల్లదీశాడు. ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పరాజయం పాలవడంతో లోకేష్‌కు మంత్రి పదవి, ఆయన వద్ద పీఎస్ అర్జునరావుకు పదవి పోయింది. ఇక తమకు ఉద్యోగాలు ఇప్పించలేరని నిర్ధారించుకున్న బాధితులంతా కలిసి ఆయనను నిలదీయగా మీ డబ్బులు తిరిగి చెల్లిస్తానని హామీ ఇచ్చాడు. సమయం గడుస్తున్నా డబ్బులుతిరిగి రాకపోవడంతో వారంతా కలిసి బందరు రూరల్ పోలీసుస్టేషన్‌లో అర్జునరావుపై అక్టోబరు 10న ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ వ్యవహారం వెనుక ఎవరెవరు ఉన్నారనే విషయాన్ని తేల్చేందుకు రంగంలోకి దిగారు. ఇక ఈ వసూళ్ల దందాలో కీలక పాత్ర పోషించిన కోన నాగార్జున బందరు తెలుగు యువత కార్యదర్శి కావడం గమనార్హం. గత ఐదేళ్లలో చంద్రబాబు, లోకేష్‌ల పేరు చెప్పుకుని ఇలా నాయకుల నుంచి మంత్రుల పేషీలు అవినీతి అడ్డాలుగా మారాయని, ఈ అక్రమ వసూళ్ల దందాలో టీడీపీ పెద్దలకు కూడా వాటాలు అందాయని తెలుస్తోంది. అందుకే తమ పేషీల్లో ఇన్ని అక్రమాలు జరిగినా బాబు, లోకేష్‌లు పెద్దగా పట్టించుకోలేదని తెలుస్తోంది. ఈ అక్రమ వసూళ్ల దందా వెనుక కేవలం లోకేష్ పీయస్ అర్జున్‌రావుకు మాత్రమే సంబంధం ఉందా..లేదా ఆయన వెనుక టీడీపీ పెద్దలు ఎవరైనా ఉన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేయనున్నట్లు సమాచారం. మొత్తంగా లోకేష్ పీయస్ అర్జున్‌రావు చేసిన వసూళ్ల బాగోతం బయటపడడంతో టీడీపీ నేతల్లో ఆందోళన మొదలైంది.
Tags andhrapradesh Arhunrao cheating compliment corruption lokesh ps politics victims
Related Articles
నువ్వు హీరోవా….రౌడీవా…బొచ్చులోది…గెటవుట్…బాలయ్యపై టాలీవుడ్ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు..!
September 23, 2023
.జైలు నుంచే బాలయ్యకు చంద్రబాబు వెన్నుపోటు..బ్రాహ్మణి భజన చేస్తున్న పచ్చ సాంబడు..!
September 23, 2023
జడ్జి హిమబిందుపై టీడీపీ నేతల కారుకూతలపై రాష్ట్రపతి భవన్ సీరియస్..కఠిన చర్యలకు ఆదేశాలు..!
September 23, 2023
నీ బ్లడ్ వేరు, బ్రీడ్ వేరు అయితే మాకేంటీ..ఇక్కడ ఉన్నది కాపు బిడ్డ..జాగ్రత్త బాలయ్య..!
September 21, 2023
వైఎస్సార్సీపీ గుర్తు అయినంత మాత్రాన జైలులో ఫ్యాన్ వాడకుంటే దోమలు కుట్టవా బాబుగారు..!
September 21, 2023
చంద్రబాబు జైలుకు వెళితే..టాలీవుడ్‌కేం సంబంధం..”కమ్మ”గా కళ్లు తెరిపించిన సురేష్ బాబు..!
September 19, 2023
హైదరాబాద్‌లో టీడీపీ కమ్మోళ్లే కాదు..జగన్ ఫ్యాన్స్ కూడా ఉన్నారబ్బా..దెబ్బకు దెబ్బ అంటే ఇదే..!
September 19, 2023
జగన్ కేసీఆర్‌లపై ప్రశంసలు..పవన్, బాబుకి అక్షింతలు..మంట పుట్టిస్తున్న జేడీ ట్వీట్స్..!
September 16, 2023
చంద్రబాబుకు మళ్లీ షాక్ ఇచ్చిన ఏసీబీ కోర్డ్..రెండు బెయిల్ పిటీషన్లు కూడా వాయిదా..!
September 15, 2023
జూనియర్ ఎన్టీఆరా..వాడో ఓ పిల్ల సైకో…కులపోళ్లతో తిట్టిస్తున్న పచ్చమీడియా..ఇది నారా కుట్ర..!
September 15, 2023
ఏఏజీ పొన్నవోలుని చెప్పుతో కొట్టిస్తా..నా కొడకా..అని తిట్టించిన టీవీ 5 పచ్చ సాంబడు..!
September 15, 2023