మిషన్ భగీరథ గొప్ప పథకం అని హడ్కో సీఈవో రవికాంత్ ప్రశంసించారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా శనివారం నల్గొండ జిల్లా పీఏ పల్లి మండలం కోదండ పురం గ్రామంలో భగీరథ ట్రీట్ మెంట్ ప్లాంట్ ను రవికాంత్ సందర్శించారు. ఈ సందర్భంగా అధికారులు ఘనస్వాగతం పలకగా అనంతరం ఆర్డ్యబ్లూఎస్ అధికారులతో సమావేశం నిర్వహించారు.
అనంతరం అయన మాట్లాడుతూ.. ఇంటింటికి సురక్షిత జలాలను అందించే భగీరథ గొప్ప పథకం అన్నారు. ఈ బృహత్ కార్యక్రమానికి హడ్కో తరుపున 4,750కోట్ల ఆర్ధిక సాయం చేయడం సంతృప్తి గా ఉందన్నారు. ఒక తెలుగు వాడిగా తెలుగు రాష్ట్రాలు అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగుతుంటే గర్వంగా ఉందన్నారు.
భగీరథ పథకం ద్వారా మారుమూల గ్రామాల్లో కూడా ఇంటిటికి నది జలాలు వస్తున్నాయని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వాన్ని,అధికారులను మనసార అభినందిస్తున్నానని క్షేత్ర స్థాయిలో పర్యటిస్తుంటే భగీరథ పథకం గొప్పదనం తెలుస్తుందన్నారు. మనిషి ప్రాధమిక అవసరల్లో నీరు ముఖ్యం అని అలాంటి సురక్షిత నీటిని ఉచితంగా ప్రజలందరికీ అందిస్తుండటం అభినందనీయం పేర్కొన్నారు.