ఏపీలో ఎల్లోమీడియా అసత్య కథనాలను కట్టడి చేసేందుకు జగన్ సర్కార్ తీసుకువచ్చిన జీవో నెంబర్ 2430 పై చంద్రబాబు, లోకేష్‌లు అసెంబ్లీలో నానా రభన చేస్తున్నారు. ఈ జీవోలో కేవలం ప్రభుత్వంపై ఆధారాల్లేకుండా..అసత్య కథనాలు ప్రచురించే వారిపై మాత్రమే చర్యలు తీసుకుంటామంటూ స్పష్టంగా ఉందంటూ…సీఎం జగన్ స్వయంగా అసెంబ్లీలో చదివి వినిపించారు.అయినా చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేలు జీవో నెంబర్ 2430పై వాయిదా తీర్మానం కోరారు. ఈ మేరకు అసెంబ్లీ గేటు వరకు చంద్రబాబు, లోకేష్‌లు, ఎమ్మెల్యేలు ర్యాలీగా వచ్చారు. అయితే ప్రతిపక్షనేత చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేలు రావాల్సిన గేటు నుంచి కాకుండా..మరో గేటు నుంచి ప్రవేశించడంపై వివాదం నెలకొంది. రెగ్యులర్‌గా వచ్చే గేటు నుంచే రావాల్సిందేగా బాబు, లోకేష్‌లకు అసెంబ్లీ మార్షల్స్ సూచించారు. దీంతో ఆవేశానికి లోనైన చంద్రబాబు, లోకేష్‌లు డోర్లు తీయండ్రా..బాస్టర్ట్స్..యూజ్‌లెస్ ఫెలోస్ అంటూ మార్షల్స్‌ను తిడుతూ వారిపై దురుసుగా ప్రవర్తించారు. అసెంబ్లీ మార్షల్స్‌పై చంద్రబాబు, లోకేష్‌ల దురుసు ప్రవర్తనను జగన్ సర్కార్ సీరియస్‌గా తీసుకుంది. ఈ మేరకు అసెంబ్లీలో ఈ వ్యవహారంపై చర్చ జరిగింది. మార్షల్స్‌పై దాడి చేయడంపై విచారం వ్యక్తం చేయమని స్పీకర్ తమ్మినేని సీతారాం సూచించినా.. చంద్రబాబు వినిపించుకోలేదు. ఘటనకు తాను కారణమైతే, తమను ఆపిన ప్రభుత్వమే విచారం వ్యక్తం చేయమని బాబు చెప్పుకొచ్చాడు. దీంతో సభలో సభ్యుడి అనుచిత ప్రవర్తనపై చర్యలు చేపట్టాలని మంత్రి బుగ్గన సభలో తీర్మానం ప్రవేశపెట్టారు. మార్షల్స్‌ను యూజ్‌లెస్ ఫెలో, బాస్టర్ట్స్ అని తిట్టడం ఏంటీ…గొంతు పట్టుకోవడం ఏంటని బుగ్గన ఆక్షేపించారు. మార్షల్స్ పట్ల బాబు, లోకేష్‌ల తీరు సరికాదన్నారు. బుగ్గన తీర్మానం తర్వాత సభలో సభ్యులు మాట్లాడేందుకు స్పీకర్ అనుమతి ఇచ్చారు. ఈ తీర్మానంపై వైసీపీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మద్దతు పలుకుతూ చంద్రబాబు, లోకేష్‌ల తీరుపై మండిపడ్డారు. అబద్దాలు చెప్పడంలో చంద్రబాబు దిట్ట అని, మార్షల్స్ పట్ల ఆయన వ్యహారశైలిని చూసి రాష్ట్ర ప్రజలు సిగ్గుతో తలదించుకుంటున్నారని ఎమ్మెల్యే రాజా అన్నారు. వయసు పైబడటంతో మతిమరుపు వచ్చిందని తాను అన్నమాటలను అనలేదని అంటున్నారని పేర్కొన్నారు. ఆయన రావాల్సిన గేటు నుంచి రాకుండా మరో గేటు నుంచి వచ్చి మార్షల్స్‌పై విరుచుకుపడ్డారని.. గోదావరి పుష్కరాల సమయంలో పబ్లిసిటీ పిచ్చితో ఇలాగే చేసి 28 మంది ప్రాణాలను బలి తీసుకున్నారని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబుకు పౌరుషం, సిగ్గు, శరం, మానం, మర్యాద ఉందని రాష్ట్రంలో ఎవరు అనుకోవడం లేదన్నారు. తమ నేత జగన్ దమ్ము, పౌరుషం ఉన్న నేత అయినందునే 151 సీట్లు వైసీపీకి వచ్చాయని రాజా అన్నారు. పార్టీ అధ్యక్షుడిగా తండ్రి స్థానంలో ఉన్న చంద్రబాబు.. తన కుమారుడు లోకేశ్‌కే కాక మిగతావారికి కూడా బుద్ధిచెప్పలేకపోతున్నారని రాజా ధ్వజమెత్తారు. అందుకే మార్షల్‌పై లోకేశ్ రెచ్చిపోయాడని చెప్పారు. రాష్ట్రానికి తానే ఎప్పటికీ సీఎం అని చంద్రబాబు భ్రమలో బతికేస్తుంటే.. తాను సీఎం కుమారుడినని లోకేశ్ భావిస్తున్నాడని జక్కంపూడి రాజా ఫైర్ అయ్యారు.మొత్తంగా అసెంబ్లీలో మార్షల్స్‌పై బాబు, లోకేష్‌ల అనుచిత ప్రవర్తనపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు సభామర్యాదలకు భంగం కలిగించేలా ప్రవర్తించడం తీవ్ర చర్చనీయాశంగా మారింది.
