జీరో సైజ్ నడుముతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన హీరోయిన్ శృతి హాసన్.. కమల్ కుమార్తెగా కంటే ఈమెకు సొంతంగానే క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ కాస్త ఇప్పుడు తగ్గిపోవడానికి ఆమె ప్రేమే కారణమట. ప్రియుడితో పీకల్లోతు ప్రేమలో ఉంటూ డేటింగ్ లో బిజీగా ఉండడంతో చివరకు అది కాస్త బెడిసి కొట్టింది. దీంతో ఆమె ఇప్పుడు సినిమాలపై దృష్టి పెట్టారు. సరిగ్గా ఏడాదిక్రితం వంశీ పైడిపల్లి ఓకథ సిద్థం చేశారు. ఆ సినిమాలో హీరో మహేష్ బాబు.. హీరోయిన్ శృతి హాసన్ గా నిర్ణయించారు. అయితే ఇద్దరు ఒకే చెప్పేశారు. ఇక షూటింగ్ ప్రారంభమవ్వడమే ఆలస్యమవడంతో వంశీ కథ ఎంతగానో నచ్చడంతో మహేష్ కూడా ఇంట్రస్ట్ చూపించారట. కానీ ఉన్నట్లుండి శృతి తన ప్రియుడితో బిజీగా ఉండడం.. విదేశాలకు వెళ్లడంతో షూటింగ్ కి రానని చెప్పిందట దాంతో షూటింగ్ కాస్త ఆగిపోయింది. అలా ఆ ప్రాజెక్ట్ ఆగిపోగా మళ్లీ సంవత్సరం గ్యాప్ తరువాత మళ్లీ శృతినే నేరుగా వంశీకి ఫోన్ చేసి షూటింగ్ చేద్దామని చెప్పిందట. మహేశ్ కు సారీ చెప్పింద.. దీంతో మళ్ళీ షూటింగ్ కు ప్లాన్ చేసుకుందామని చెప్పిందట. అలాగే ఇప్పటి వరకు తెలుగుపరిశ్రమలో మహేష్ తో కలిసి నటించి కూడా గ్యాప్ తీసుకున్న హీరోయిన్ ఎవరన్నా ఉన్నారంటే అది ఒక్క శృతి హాసనే అంటున్నారు.