తెలంగాణ రాష్ట్రంలో సికింద్రాబాద్ పరిధిలోని కొన్ని రైళ్ళను ఆరు నెలల పాటు బంద్ చేయనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. భద్రత,కొన్ని నిర్వహణ పనుల దృష్ట్యా వచ్చే ఏడాది జనవరి ఒకటో తారీఖు నుంచి జూన్ ముప్పై తారీఖు వరకు పలు మార్గాల్లో పదమూడు రైళ్లను రద్దు చేయనున్నారు. ఏమి ఏమి రైళ్ళు రద్దు అవుతున్నాయో తెలుసుకుందాం..
సికింద్రాబాద్ పరిధిలో రద్ధు అయిన రైళ్ల వివరాలు-
సికింద్రాబాద్-మేడ్చల్-సికింద్రాబాద్ డెము ప్యాసింజర్(77601/77602)
ఫలక్నుమా-మేడ్చల్-ఫలక్నుమా డెము ప్యాసింజర్
(77679/77680)
ఫలక్నుమా-మేడ్చల్-ఫలక్నుమా డెము ప్యాసింజర్
(77681/77682)
ఫలక్నుమా-ఉమ్దానగర్-ఫలక్నుమా డెము ప్యాసింజర్
(77635/77647)
ఫలక్నుమా-ఉమ్దానగర్-సికింద్రాబాద్ డెము ప్యాసింజర్
(77638/77649)
బొల్లారం-ఫలక్నుమా-బొల్లారం డెము ప్యాసింజర్
(77604/77605)
ఫలక్నుమా-మనోహరాబాద్-సికింద్రాబాద్ డెము ప్యాసింజర్ (77609/77610)
సికింద్రాబాద్-మనోహరాబాద్-సికింద్రాబాద్ డెము ప్యాసింజర్ (77613/77614)
సికింద్రాబాద్-మనోహరాబాద్-సికింద్రాబాద్ డెము ప్యాసింజర్ (77617/77618)
సికింద్రాబాద్-ఉమ్దానగర్ డెము ప్యాసింజర్
(77630)
ఫలక్నుమా-ఉమ్దానగర్ డెము ప్యాసింజర్
(77631)
ఉమ్దానగర్-ఫలక్నుమా-ఉమ్దానగర్ డెము ప్యాసింజర్
(77640/77641)
ఫలక్నుమా-భువనగరి-ఫలక్నుమా ప్యాసింజర్
(67275/67276)
పాక్షికంగా రద్ధు అయిన రైళ్ళ వివరాలుః
బోధన్-మహబూబ్నగర్ ప్యాసింజర్ (రైల్ నెంబర్: 57474)ను డిసెంబర్ 16వ తేదీ నుంచి మార్చి 15వ తేదీ వరకు షాద్నగర్-మహబూబ్నగర్ స్టేషన్ల మధ్య.
మహబూబ్నగర్-కాచిగూడ ప్యాసింజర్ (రైల్ నెంబర్: 57456)ను డిసెంబర్ 16వ తేదీ నుంచి మార్చి 15వ తేదీ వరకు మహబూబ్నగర్-షాద్నగర్ స్టేషన్ల మధ్య
మేడ్చల్-కాచిగూడ ప్యాసింజర్ (రైల్ నెంబర్: 57308)ను డిసెంబర్ 16వ తేదీ నుంచి మార్చి 15వ తేదీ వరకు మేడ్చల్-బొల్లారం మధ్య .