కేంద్రం నుండి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులను త్వరగా విడుదల చేయాలని రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ కు చెందిన ఎంపీల బృందం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ను కల్సి కోరారు.
ఇటీవల తెలంగాణకు రావాల్సిన నిధులపై కేంద్రానికి ముఖ్యమంత్రి కేసీఆర్ రాసిన లేఖలపై ఎంపీలు ఈ భేటీలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ రాసిన లేఖను స్వయంగా ఆమెకు అందజేశారు. నిధుల విడుదలలో కేంద్రం ఆలస్యం చేస్తుంది అని ఎంపీ,లోక్ సభ పక్షనేత నామా నాగేశ్వరరావు తెలిపారు.
రాష్ట్రానికి రావాల్సిన నిధులను ఎప్పటికప్పుడు విడుదల చేయాలని కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తున్నామని వారు మీడియాకు వివరించారు. కేంద్ర ఆర్థిక మంత్రిని కలిసినవారిలో ఎంపీలు మాలోత్ కవిత,పసునూరి దయాకర్, బిబిపాటిల్ తదితరులు ఉన్నారు.