తెలంగాణ రాష్ట్ర రాజధాని మహనగరం హైదరాబాద్ లో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. నగరంలో బంజారాహీల్స్ లోని ఎన్బీటీ నగర్లో నూర్ సయ్యద్ అనే వ్యక్తిని నలుగురు దుండగులు అతికిరాతకంగా హత్య చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది.
బంజారాహీల్స్ లో ఆటోలో వచ్చిన గుర్తు తెలియని నలుగురు దుండగులు నూర్ సయ్యద్ పై కత్తులతో.. రాడ్లతో దాడికి దిగారు. గాయాలు తీవ్రమవ్వడంతో నూర్ అక్కడక్కడే మృతి చెందాడు.
ఆ తర్వాత నిందితులు బంజారాహీల్స్ లోని పోలీసు స్టేషన్ కెళ్ళి తామే హత్య చేశామని లొంగిపోయారు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి దగ్గర నుండి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.