గత కొద్ది రోజులుగా చంద్రబాబు, లోకేష్‌లపై పదునైన పదజాలంతో విమర్శలు చేస్తున్న మంత్రి కొడాలి నాని మరోసారి విరుచుకుపడ్డారు. అసెంబ్లీలో మార్షల్స్‌పై అనుచితంగా ప్రవర్తించిన చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలంటూ మంత్రి బుగ్గన తీర్మానం పెట్టారు. ఈ తీర్మానంపై నాని మాట్లాడుతూ..ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు కారు రావడానికి ప్రత్యేకంగా ఓ గేటు ఉంది..కానీ ఆయన ఉద్దేశపూర్వకంగా రోడ్డుమీద దిగిపోయి..ఎమ్మెల్యేల గేటు దగ్గరకు వెళ్లి 30 మంది ఎమ్మెల్సీలను, 20 మంది ఎమ్మెల్యేలను..టీడీపీ కార్యకర్తలను మొత్తం ఓ వంద మందిని వెంటపెట్టుకుని ఫ్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శిస్తూ లోపలకు వస్తుంటే..మార్షల్స్ సిబ్బంది వీరిలో ఎవరు ఎమ్మెల్యేలు, ఎవరు కార్యకర్తలో అర్థం కాక..గేట్లు మూసేసి, ఒక్కొక్కరిని లోపలకు రమ్మన్నారని మంత్రి నాని తెలిపారు. మేమంతా లోపలకు వస్తామంటూ బాబూ, లోకేష్‌లు మార్షల్స్‌ను దుర్భాషలాడారని, చీఫ్ మార్షల్‌ను స్వయంగా చంద్రబాబు వెనక్కి తోసినట్లు నాని పేర్కొన్నారు. బాబు, లోకేష్‌లు అడ్డగోలుగా మార్షల్స్‌పై దాడి చేసింది కాకుండా..అసెంబ్లీ లోపలకు వచ్చి..మమ్మల్ని అడ్డుకున్నారంటూ డ్రామాలు ఆడుతున్నారని, అసలు 40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు ఇలాంటి బుద్ధి లేని పని చేస్తాడా అంటూ నాని ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌పై చంద్రబాబు చేస్తున్న విమర్శలను తీవ్రంగా ఆక్షేపించారు. 35 ఏళ్ల వయసులో 3 నెలలు ఎంపీగా ఉన్న జగన్ పార్టీ పెట్టి..ఈ రోజు 151 సీట్లతో ఘన విజయం సాధించారని కొనియాడారు. ఇంతటి విజయం ఆ రోజుల్లో ఎన్టీఆర్కే సాధ్యమైందని నాని అన్నారు. అయితే ఈ సిగ్గులేని టీడీపీ నాయకులు..జగన్మోహన్రెడ్డిని తిడుతున్నారని ఆక్షేపించారు. పది మంది ఎమ్మెల్యేలు కూడా లేకున్నా….వైస్రాయి హోటల్లో 165 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పి.. తన రాజగురువు పత్రికలో పబ్లిష్ చేయించుకుని, పార్టీని లాక్కున్న వ్యక్తి.. చంద్రబాబు అని నాని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ అనే వ్యవస్థలోకి పందికొక్కులా దూరి..రామారావుగారికి చంపేసి, ఆ వ్యవస్థను నాశనం చేసిన వ్యక్తి చంద్రబాబు అయితే…ఒక వ్యక్తిగా బయలుదేరి, ఒక వ్యవస్థను క్రియేట్ చేసిన వ్యక్తి…జగన్మోహన్ రెడ్డి అని నాని అన్నారు. కాబట్టి చంద్రబాబు, టీడీపీ నేతలు ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడాలని మంత్రి కొడాలి నాని హెచ్చరించారు. చంద్రబాబుపై కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు మరోసారి టీడీపీ, వైసీపీల మధ్య అగ్గి రాజేస్తున్నాయి.
