విక్టరీ వెంకటేష్…కలియుగ పాండవులు చిత్రంలో సినీ రంగంలో అడుగుపెట్టి తన నటనతో, మాటలతో ప్రేక్షకులను అలరించి ఎన్నో హిట్ సినిమాలు తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుత రోజుల్లో మల్టీస్టారర్ అంటే ఎవరికైనా వెంటనే గుర్తొచ్చేది వెంకటేష్ నే. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘ఎఫ్ 2’ మరియు ప్రస్తుతం వెంకీ మామ చిత్రంలో నటిస్తున్నారు. ఒక్కప్పుడు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అంటే వెంకటేష్ కే సాధ్యం అని చెప్పాలి. అప్పట్లో ఆయనకు ఉన్న లేడీస్ ఫాలోయింగ్ అలాంటిది మరి. ఇప్పటికీ ఆ క్రేజ్ అలానే ఉందని చెప్పాలి. అలాంటి వ్యక్తి ఈరోజు తన పుట్టినరోజు సందర్భంగా దరువు సోషల్ మీడియా తరుపున మరియు అభిమానుల తరుపున పుట్టినరోజు శుభాకాంక్షలు. అంతేకాకుండా తన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు రిలీజ్ అవుతున్న వెంకీ మామ సినిమా హిట్ అవ్వాలని కోరుకుందాం.
