పొమ్మన లేక పొగబెడుతూ ఉన్నారు..నా మీద చాలా కోపం ఉంది జనసేన పార్టీ కి..ఇంగ్లీష్ మీడియం మీద ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడాను అని పార్టీ తీవ్ర స్థాయిలో నాకు వార్నింగ్ ఇచ్చింది. నేను లెక్క చేయలేదు. మంచి పని చేయడానికి, మంచి పనులు చేస్తే సమర్తించడానికి నన్ను ఎమ్మెల్యే గా ఎన్నుకున్నారు రాజోలు ప్రజలు అంతేకాని ఇంకో పార్టీ కి వత్తాసు పలుకుతూ ,పక్క పార్టీ చెప్పినట్లు నడుచుకుంటూ వాళ్ళు చెప్పింది మా పార్టీ చేస్తూ పోతూ ఉంటే ఇక మా పార్టీకి దిశ నిర్దేశం లేనట్లే కదా?
అందుకే నేను వ్యతిరేకంగా ఉన్నాను.పార్టీ కి నాకు కొంత స్పేస్ ఏర్పడింది .ఎంతసేపు ఆ 10 మంది పనికిమాలిన నాయకులను వెంట పెట్టుకుని పనికి మాలిన పనులు,ధర్నాలు ,దీక్షలు అంటూ పచ్చ పార్టీ పనులను మా పార్టీ భుజాన వెత్తుకుని మోయడం ఏంటి అని అడుగుతున్నాను. ఇప్పటికైనా ఒక పార్టీ నాయకుడు గా మెలగాలి అని ,పార్టీ అధ్యక్షుడు గా వ్యవహరించాలి కానీ నాదెండ్ల కట్టు బానిస లాగా వ్యవహరించడం మానేయాలి అని కోరుతూ ఉన్నాను.
కొంతమంది పనికి మాలిన నాయకులు పవన్ కళ్యాణ్ ను తప్పు దోవ పట్టిస్తూ ఉన్నారు..గెలిచిన వాడికి కాకుండా పార్టీ లో డిపాజిట్ లు రాణి వాళ్లకే ఎక్కువ గౌరవం ఉంది.ఇందుకు కారణం నేను దళిత ఎమ్మెల్యేను కాబట్టే.. తక్షణం ఆయన తన పద్ధతి మార్చుకోవాలి.లేదంటే రాబోయే కాలం లో పవన్ కళ్యాణ్ ను పట్టించుకునే వాళ్ళు కరవు అవుతారు.రాజీనామ చేసి మళ్ళీ గెలుస్తార అన్న జర్నలిస్ట్ ప్రశ్నకు సమాధానం గా ఎపుడైనా నేను సిద్ధంగా ఉన్నాను.రాష్ట్రం లో ఆయన ఎక్కడైనా పోటీ చేసి అసెంబ్లీ కి వచ్చే సత్తా ఉందా అని ఇప్పటికి ఆ వ్యాఖ్యకి కట్టుబడి ఉన్నానని చెప్పడం జరిగిందని రాపాక అన్నారు.