చెవిరెడ్డి భాస్కర రెడ్డి, టీడీపీ త్రిభుత్వ హయాంలో తనను ఎంతగానో ఇబ్బందులకు గురి చేశారని గుర్తు చేశారు. మీడియాకు సంబందించి 2430 జిఓ పై జరిగిన చర్చల విషయమై తనకు ఎదురైన పరిస్థితులను వివరిస్తూ. చంద్రబాబు ఏమీ చేయకపోయినా, పోలీసులు ఆపారనో, మార్షల్స్ నెట్టారనో ఆరోపిస్తున్నారని, కాని తన ప్రభుత్వ హయాంలో తనను ఎన్నో విదాలుగా వేదించారని ఆయన అన్నారు. ఆర్డిఓ ఆఫీస్ వద్ద నిరసనకు వెళితే ఢపేదార్ ను కులం పేరుతో తిట్టానని కేసు పెట్టి జైలుకు పంపారని ఆయన తెలిపారు. అక్కడ ఒక పోలీసు అదికారి తనను కొట్టారని, దానికి నిరసనగా తాను రెండు రోజులపాటు దీక్ష చేశానని ఆయన అన్నారు. చిత్తూరులోమరో ఘటనలో తనను అరెస్టు చేసి, తమిళనాడులో తిప్పారని, తన ఆరోగ్యం పాడైనా, కనీసం వైద్యం కూడా అందించలేదని ఆయన అన్నారు. తనకు పార్టీ నేతలు అండగా నిలబడి ఆత్మ స్థైర్యం ఇచ్చారని అన్నారు. అంతేకాక అప్పట్లో జగన్ కూడా టీడీపీ తనను వేధిస్తోందని చెప్పారని చెవిరెడ్డి అన్నారు