మందగమనంతో నడుస్తున్న విద్యా వ్యవస్థను చైతన్యం వంతం చేయడానికి గాను ముఖ్యమంత్రి జగన్ ఒక వైధ్యుడు మాదిరి దానిని చైతన్యపరిచే సంకల్పంతో ఉన్నారని తిరుపతి వైసిపి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి అన్నారు. అసెంబ్లీలో ఆయన ఆంగ్ల మాద్యమంపై మాట్లాడుతూ, కూలి వాడి పిల్లలు కూడా ఆంగ్లం నేర్చుకోవాలని భావించి ప్రభుత్వ స్కూళ్లలో ఆంగ్ల మాద్యమం ప్రవేశపెట్టి న ఘనత సీఎం జగన్ దని అన్నాడు. భవిషత్తు లో బతుకు తెరువుకు ఆంగ్ల మాద్యమం తప్పనసరి అవుతుందని. కాని కొందరు దుష్టబుద్దితో మాతృభాష పై ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదని వక్రీకరిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈ సందర్బంగా ఆయన స్పార్టకస్ తదితర పుస్తకాలను ఆయన ప్రస్తావించారు. ఆంగ్ల మాద్యమంలో తాను చదవలేకపోయినందున ఆ పుస్తకాలను చదవలేకపోయానని, తనకు పుస్తకాలు చదవడం ఎంతో ఇష్టం అయినా,పదేళ్ల తర్వాత తెలుగులో వస్తే కాని చదవగలేక పోయానన్నారు. ఇక్కడ ఉన్న 175 మంది ఎమ్మెల్యేల పిల్లలు,మనుమళ్లు ఏ ఒక్కరైనా తెలుగు మీడియంలో చదివిస్తున్నారా? ప్రశ్నించారు. అగ్రవర్ణాలకు, ఆదిపత్య భావజాలం ఉన్నవారికి మాత్రమే ఆంగ్ల మాద్యమం అన్న భావన ఉండడం సరికాదని , పేదలు, బలహీనవర్గాల పిల్లలు మాత్రమే ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్నారని అన్నారు.
