అమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ జనసేన, టీడీపీలను టార్గెట్ చేసినట్టు స్పష్టంగా కనిపించింది. తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయం పాలై జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు లోకేష్ చంద్రబాబు ఇంట్లో మదన పడిన సన్నివేశాలను చిత్రీకరించాడు. ముఖ్యంగా లోకేష్ ఇంట్లో పడుకొని ఏడుస్తున్న సన్నివేశాలను ఏడుస్తున్నప్పుడు బ్రాహ్మణుని ఓదార్చిన సీన్స్ను అదేవిధంగా చంద్రబాబు లోకేష్కు పప్పు వడ్డించిన ఈ సన్నివేశాలను హాస్యభరితంగా చిత్రీకరించాడు వర్మ. ముఖ్యంగా జనసేన టిడిపిల లోపాయికారీ ఒప్పందాలు ను వర్మ అ బయటపెట్టేందుకు ప్రయత్నించాడు అనే చెప్పుకోవాలి. సినిమాలో లోకేష్, పవన్ కళ్యాణ్ ఇద్దరు ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కూర్చుని మాట్లాడుకుంటున్నారు గా పలు సన్నివేశాలను చూపించాడు దీని ద్వారా ఈ రెండు పార్టీలు ఇంటర్నల్ గా కలిసి ఇ రాజకీయాలు చేస్తున్నాయని సంకేతాలను వర్మ చూపించే ప్రయత్నం చేశాడు. మొత్తంగా సినిమా పరంగా వర్మ మరో హిట్ కొట్టాడు అని చెప్పుకోవచ్చు.