నారావారి పుత్రరత్నం లోకేష్‌ను పప్పు అంటూ సోషల్ మీడియాలో పాటు రాజకీయ ప్రత్యర్థులు కూడా ట్రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. గూగుల్‌లో pappu అని టైప్ చేస్తే లోకేష్ ఫోటో వస్తుంది. ముఖ్యంగా కొడాలి నాని, రోజా వంటి వైసీపీ నేతలు, టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పదే పదే లోకేష్‌ను పప్పు అంటూ చెడుగుడు ఆడేసుకుంటున్నారు. ఇక రాంగోపాల్ వర్మ అయితే ఏకంగా తన అమ్మరాజ్యంలో కడప బిడ్డలు సిన్మాలో లోకేష్‌ను పప్పులాంటి అబ్బాయి అంటూ చిత్రీకరించాడు. అంతలా లోకేష్‌పై పప్పు అంటూ ముద్రపడింది. తాజాగా ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో పప్పు ధరలపై చర్చ సందర్భంగా మంత్రి కొడాలి నాని మరోసారి లోకేష్‌ను పప్పు అంటూ ఎద్దేవా చేశారు. నాలుగో రోజు అసెంబ్లీ సమావేశాలలో భాగంగా ప్రశ్నోత్తారాల సమయంలో నిత్యావసర వస్తువుల ధరలపై టీడీపీ ఆదిరెడ్డి భవాని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. రాష్ట్రంలో మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి ప్రజల పరిస్థితి ఏమి కొనేటట్టు లేదు తినేటట్టు లేదు అంటూ పెరిగిన నిత్యావసర వస్తువుల ధరల గురించి ప్రసంగించారు. పప్పులు నిప్పులయ్యాలని..వంట నూనె కూరగాయల ధరలు చుక్కలంటాయని వీటికి తోడు తాజాగా ఆర్టీసీ బస్సు టికెట్స్ ధరలు కూడా పెంచారు అంటూ విరుచుకుపడింది. అలాగే గత ఆరు నెలలకు ముందు ఉన్న ధరలు ఇప్పుడు ఉన్న ధరలను ఆమె సభలో చదివి వినిపించారు. కందిపప్పు గతంలో రూ.72 ఉండగా..ఇప్పుడు 110 అయిందని..వేరు శనగలు అప్పుడు రూ.98 ఉండగా ఇప్పుడు రూ.120 అయ్యాయని..ఉల్లి అయితే ఏకంగా రూ. 40 నుంచి రూ 120 కు వెళ్లిందని వివరించారు. .వైసీపీ నేతలకు ఎంతసేపు మమ్మల్ని విమర్శించడం తప్పా..ప్రజల గోడు పట్టదని తీవ్రంగా విమర్శించారు. భవానీ ప్రశ్నకు పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని సమాధానం చెబుతూ.. ప్రతిపక్షం చెప్పేవన్నీ పచ్చి అబద్దాలు అని మండిపడ్డారు. సాధారణంగా ప్రతి సంవత్సరం కూడా నిత్వావసరాల ధరలు 10 శాతం పెరుగుతాయని అవి పెరుగుదల కింద పరిగణలోకి తీసుకోరని మంత్రి తెలిపారు. ఈ సమయంలో పప్పుల రేట్ల గురించి నాని మాట్లాడుతుండగా..ఆయన వెనక ఉన్న సభ్యులు ఏ పప్పు అని సరదాగా అడిగారు…దీంతో నాని ఆ పప్పు కాదులేండి కందిపప్పు అంటూ చెప్పారు.. ఆ పప్పు కాదు అన్నది లోకేష్ గురించే అని అందరికీ అర్థమై ఒక్కసారిగా నవ్వుకున్నారు. మొత్తంగా లోకేష్‌పై పప్పు ముద్ర లైఫ్‌లాంగ్ పోయేలా లేదు.
