ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేత చంద్రబాబు ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఆసక్తిని రేపుతున్నాయి. తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యే సత్యప్రసాద్ ఓ ప్రశ్న అడిగారు ఒకే సామాజిక వర్గానికి సంబంధించి సలహాదారులు వివిధ పదవులు అన్నీ ఇస్తున్నారని 50% రిజర్వేషన్ ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. దీనికి వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు సమాధానం చెబుతున్నారు ఈ క్రమంలో జగన్ జోక్యం చేసుకుని కచ్చితంగా ప్రతి ప్రతి ప్రతి ప్రతి మైనార్టీలకు 50 శాతం ఇచ్చామని బలహీనవర్గాల ఎస్సీ బీసీలకు అండగా ఉంటామన్నారు. అలాగే చంద్రబాబు అత్తగారు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడైన ఎన్టీ రామారావు భార్య లక్ష్మీపార్వతికి కూడా తామే పదవి ఇచ్చామని ఈ విషయం చంద్రబాబు గుర్తుపెట్టుకోవాలని జగన్ సూచించారు.
