తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళ సై సౌందర్ రాజన్ ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై ప్రశంసల వర్షం కురిపించారు. గవర్నర్ తమిళ సై నిన్న మంగళవారం కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించారు. ఈ సందర్భంగా గవర్నర్ కాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయంలో గవర్నర్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం లక్ష్మీ పంపుహౌస్ (కన్నెపల్లి), లక్ష్మీ (మేడిగడ్డ), సరస్వతి (అన్నారం) బరాజ్‌లను సందర్శించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ “సీఎం కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం నిర్మాణం సూపర్. కాళేశ్వరంతో తెలంగాణ రైతాంగ రూపురేఖలు మారతాయి.
గత ఆరేళ్ళుగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం చేపడుతున్న పలు సంక్షేమాభివృద్ధి పథకాలు బాగున్నాయి. ఎస్సీ,ఎస్టీ లకు ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి “అని ఆమె కొనియాడారు.