త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా , పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన కొత్త చిత్రం అల వైకుంఠపురములో. ఈ సినిమాపై బన్నీ అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే విడుదలైన పాటలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సోషలం మీడియాలో ట్రేండింగ్ లో ఉన్నాయి. ముఖ్యంగా తమన్ స్వరపరిచిన పాటలు ఆడియన్స్‌కి బాగా కనెక్ట్ అయిపోయాయి. ఇప్పుడు ఆడియన్స్‌ను మరింత ఉర్రూతలూగించేందుకు ‘అల వైకుంఠపురములో’ టీజర్‌ను తీసుకొచ్చారు. తాజాగా ఒక టీజర్ ను రిలీజ్ చేశారు. క్లాస్ లుక్ తో బన్నీ చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు. లవ్ .. కామెడీ .. యాక్షన్ సీన్స్ పై కట్ చేసిన ఈ టీజర్ ఆకట్టుకునేలా వుంది. పూజా హెగ్డే ఆఫీస్ లోనే బన్నీ పనిచేస్తాడనే క్లారిటీ అయితే ఈ టీజర్ తో వచ్చేసింది. ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలో ‘టబు’ కనిపించనుంది. ఆమె పాత్ర ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
