తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు కేటీరామారావు ట్విట్టర్ సాక్షిగా సిరిసిల్ల నియోజకవర్గానికి కాళేశ్వరం జలాలు రావడంపై స్పందించారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్” గోదావరి బ్యాక్ వాటర్ సిరిసిల్ల శివారుకు చేరుకోవడం చాలా సంతోషంగా ఉంది”అని అన్నారు. సిరిసిల్ల జలకళను సంతరించుకున్న తరుణంలో గోదారమ్మ పరవళ్లతో రైతుల కళ్లలో చెరగని సంతోషం నిండుకున్నది.
తెలంగాణ కోటి ఎకరాలను మాగాణంగా మార్చేందుకు వేసిన జలబాటలు.. శ్రీరాజరాజేశ్వర ప్రాజెక్టు బ్యాక్ వాటర్ . ఈ సందర్భంగా సిరిసిల్ల నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నందుకు గర్వపడుతున్నాను”అని ట్విట్టర్లో పేర్కొన్నారు.