ఒకప్పడు అశ్లీల చిత్రాలు చూడాలంటే ఎంతో సీక్రెట్ గా భయం భయంగా ఎవరూ లేరని నిర్థారించుకున్న తర్వాత చూసేవారు. కానీ నేడు చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు అందులో ఇంటర్ నెట్ ఫ్రీ.. ఇంకేముందు ఫోర్న్ సైట్స్ ఓపెన్ చేయడం పైశాచిక ఆనందం పొందండ కామన్ అయ్యింది. ఈ రోగం ముదిరి అత్యాచారాలు, లైంగిక వేధింపులు, హత్యలు చేసే వరకు యువతను తీసుకు వెళ్తుందని మానసిక నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ ఫోర్న్ చూస్తున్న వారిని కంట్రోల్ చేసే పనిలో పడ్డారు పోలీసులు. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది కదా అని అదేపనిగా ఆన్ లైన్ లో అశ్లీల వీడియోలు చూస్తున్నారా? మీకు పోలీసుల నుంచి ఏ క్షణమైనా సమన్లు రావచ్చు. సైబర్ క్రైమ్ కు చిక్కితే ఏడేళ్ల వరకూ జైలు శిక్ష కూడా పడవచ్చు. తమిళనాడులో ఇప్పుడు అదే జరుగుతోంది.
కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్ లలో అశ్లీల వీడియోలను చూస్తున్న వారిని ఐపీ అడ్రస్ ల ఆధారంగా గుర్తిస్తున్న పోలీసులు వారికి హెచ్చరికలు పంపుతున్నారు. అశ్లీల సైట్లలో గంటల కొద్దీ గడుపుతున్న వారిని గుర్తించడమే పనిగా పెట్టుకున్న పోలీసులు, తొలుత హెచ్చరించడం, ఆపైనా మారకుంటే కేసులు పెట్టి, కోర్టులో హాజరు పరచడం చేస్తున్నారు.
