విజయవాడ తెలుగుదేశం పార్టీ ఎంపీ కేశినేని నాని కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన పౌరసత్వ బిల్లును వ్యతిరేకించిన తీరు ఇప్పుడు ఆసక్తికరంగా ఉంది. మతం ఆదారంగా పౌరసత్వం ఇవ్వజాలమని, మనది లౌకికదేశం అని ఆయన్నారు. తన మనస్సాక్షిగా బిల్లును వ్యతిరేకిస్తున్నానని నాని అన్నారు. మీడియాతో మాట్లాడుతూ తనపై ఎలాంటి కేసులు లేవని, తాను ఎవరికి భయపడే అవసరం లేదన్నారు. ఆయన బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయబోతున్నారన్నఅబిప్రాయం వచ్చింది. కానీ అంతిమంగా ఆయన ఓటింగ్ కు దూరంగా ఉన్నారు. మిగిలిన ఇద్దరు టిడిపి ఎంపీలు గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు మాత్రం కేంద్రం బిల్లుకు అనుకూలంగా ఓటు వేశారు. వైసిపి ఎంపీలు పార్టీ నిర్ణయం ప్రకారం అనుకూలంగా ఓటు వేయగా.. టిడిపిలో ఒక ఎంపీ బిన్నంగా వ్యవహరించడం విశేషం.. అయితే తనకు ఎవరూ అనుకూలంగా ఓటు వేయాలని చెప్పలేదని కూడా నాని అంటున్నారు. మరోవైపు టిఆర్ఎస్ ఈ బిల్లును వ్యతిరేకించింది.
