అత్యంత ఆదరణ పొందిన సామాజిక మాధ్యమాల్లో ఒకటి ట్విట్టర్. ఈ ట్విట్టర్ అకౌంటులో దక్షిణాది భామలైన హాట్ బ్యూటీస్ కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్ తమ హవా కొనసాగిస్తున్నారు.
2019 సంవత్సరం పూర్తి కావొస్తుండడంతో ఈ ఏడాది ట్విట్టర్‌లో టాప్
ట్రెండ్స్‌లో ఉన్న పలువురు ప్రముఖుల పేర్లని ప్రకటించింది ట్విట్టర్ ఇండియా. ఫీమేల్ జాబితాలో అందాల భామలు కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్‌లు ఏడు, పదో స్థానాన్ని దక్కించుకున్నారు .
ప్రస్తుతం తెలుగు,తమిళం, హిందీ భాషలలో ఈ ఇద్దరు భామలు పలు చిత్రాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు.