ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై మాజీ ఎంపీ, టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి ప్రశంసలు కురిపించారు. జేసీ బుధవారం అసెంబ్లీ లాబీలో మీడియాతో చిట్ చాట్ చేస్తూ..‘సీఎం జగన్ గట్స్ ఉన్న నాయకుడు. చేయాలనుకున్న పని ధైర్యంగా చేస్తారు. ఆరోగ్యశ్రీ విషయంలో ముఖ్యమంత్రి నిర్ణయానికి హ్యాట్సాఫ్. సీఎం జగన్ కనిపిస్తే అభినందిస్తా. ఈ విషయంలో చంద్రబాబు నాయుడు ఏమనుకున్నా ఫర్వాలేదు. ఆరోగ్యశ్రీ ఎంతోమంది పేదలకు ఉపయోగపడుతుంది. సీఎం జగన్ ఆరు నెలల పాలన చాలా బాగుంది ’ అని పేర్కొన్నారు.
