ప్రపంచం మొత్తంలో భారత క్రికెట్ జట్టు అంటే అందరికి మంచి అభిమానం ఉంటుంది. ఎందుకంటే మైదానంలో వారి నడవడిక,వారి చూపించే ప్రేమలు అలా ఉంటాయి. మరోవైపు ఒకప్పుడు క్రికెట్ అంటే ఆస్ట్రేలియా పేరే బయటకు వచ్చేది ఎందుకంటే వరుస ప్రపంచకప్ లను సొంతం చేసుకున్నారు. ఇక ఇంగ్లాండ్ విషయానికి వస్తే క్రికెట్ పుట్టినిల్లు అదే. అయిన మొన్న ప్రపంచకప్ వరకు వారి పేరిట టైటిల్ లేదు. ఇక టీమిండియా విషయానికి వస్తే 1983 లో కపిల్ దేవ్ సారధ్యంలో ఇండియాకు ప్రపంచకప్ వచ్చింది. ఆ తరువాత మల్లా ఇప్పుడు 2011 లో ధోని సారధ్యంలో వచ్చింది. ఇక అప్పటినుండి భారత్ కు తిరుగులేదని చెప్పాలి. ఈ దశాబ్దకాలంలో అన్ని ఫార్మాట్లో కలిపి ఎక్కువ విజయాలు సాధించిన జట్టుగా నిలిచింది. ఇండియా మొత్తం 278విజయాలు సాధించగా, ఆస్ట్రేలియా 238, ఇంగ్లాండ్ 227 విజయాలతో తర్వాత స్థానాల్లో ఉన్నారు.
