జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఆయన పార్టీ ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్ కు మధ్య దూరం పెరిగిందా అని అంటే..తాజాగా జనసేన ఎమ్మెల్యే ఇంగ్లీష్ మీడియంపై ప్రభుత్వం విదానాన్ని సమర్దిస్తూ మాట్లాదిన విధానం నిజమేనని స్పష్టం చేస్తోంది. రాపాక వర ప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మీడియం పెట్టడం ద్వారా బడుగు ,బలహీనవర్గాలవారికి ఎంతో ఉపయోగం జరుగుతుందని అన్నారు. మన ప్రాంతం నుంచి అనేక మంది గల్ఫ్ దేశాలకు వెళ్లి కూలీ పనిచేసుకుంటున్నారని, అదే ఇంగ్లీష్ మీడియంలో చదువుకుని ఉంటే మంచి ఉద్యోగాలు సంపాదించుకునేవారని ఆయన ఆంగ్ల మాధ్యమం కు మద్దతుగా ప్రభుత్వ స్కూళ్లలో ఆంగ్ల మీడియం పెట్టడం మంచిదేనని ఆయన అన్నారు. ఇంతకాలం పవన్ కళ్యాణ్ ప్రభుత్వ స్కూళ్లలో ఆంగ్ల మీడియం ను పెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ తర్వాత తన వైఖరి మార్చుకుని ఆంగ్ల ఈడియంతోపాటు తెలుగు మీడియం ఉండాలని అన్నారు. అయితే జనసేన ఎమ్మెల్యే మాత్రం తెలుగు మీడియం గురించి ప్రస్తావన చేయకుండానే ఆంగ్ల మీడియంను పూర్తిగా సమర్దించారు. దీని బట్టి ఎమ్మెల్యే రాపాకకు, జనసేన అధినేతకు మధ్య దూరం పెరుగుతుందని రాజకీయ వర్గాల లో చర్చనీయాంశంగా మారింది.
