బడుగు, బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి స్పీకర్ స్థానంలో ఉంటే చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని వైయస్ఆర్సీపీ పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ మండిపడ్డారు. స్పీకర్‌పై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను రమేష్ తీవ్రంగా ఖండించారు. శాసనసభలో జోగి రమేష్ మాట్లాడుతూ.. ప్రధాన ప్రతిపక్షనేత చంద్రబాబు స్పీకర్‌ను బెదిరిస్తూ కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు.. ఈ రోజు రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాలను చంద్రబాబు కించపరిచినట్లేనన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలను కించపరిచినట్లేనన్నారు.. మీరు స్పీకర్‌గా ఎన్నికైనప్పుటి నుంచి చంద్రబాబు అగౌరవంగా ప్రవర్తిస్తున్నారు. బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి ఆ చైర్లో కూర్చుంటే ఓర్వలేకపోతున్నారు. నీఅంతు చూస్తానని స్పీకర్‌ను బెదిరిస్తున్నారు. ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడితే మీకు వచ్చే నష్టం ఏంటి.? అని ప్రశ్నించారు. ఈరోజు స్పీకర్ వ్యవస్థను ఖూనీ చేసింది చంద్రబాబేనని, స్పీకర్‌గా మీరు హుందాగా ఉంటే.. బలహీన వర్గాలను కించపరిచిన చంద్రబాబును సస్పెండ్ చేయాలన్నారు. బీసీలకు న్యాయం జరగాలంటే చంద్రబాబును సభ నుంచి సస్పెండ్ చేయాలన్నారు. చంద్రబాబు స్పీకర్ ను మీ అంతు చూస్తానని చేయి చూపించి మాట్లాడటం దారుణమన్నారు జోగి రమేష్.
