Home / 18+ / యాసిడ్ దాడులకు వ్యతిరేకంగా…దీపికా పదుకొనె !

యాసిడ్ దాడులకు వ్యతిరేకంగా…దీపికా పదుకొనె !

డిఫరెంట్ సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ దీపికా పదుకొనె తన సొంత ప్రొడక్షన్ లో ఒక చిత్రాన్ని నిర్మిస్తుంది. ఎవరు చేయని ఒక ప్రయోగాత్మకమైన కథలో దీపిక నటించింది. యాసిడ్ దాడికి గురైన ఒక అమ్మాయి పాత్రలో నటించింది. ఆచిత్రానికి చాపక్ అనే పేరు పెట్టిన విషయం తెలిసిందే దానికి సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేశారు.

 

 

 

బిగ్ బడ్జెట్ సినిమాల్లోనే కాకుండా డిఫరెంట్ సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ దీపికా పదుకొనె. యాసిడ్ దాడికి గురైన ఒక అమ్మాయి పాత్రలో నటించింది.  సినిమాలో దీపిక కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్స్ లో ఒకటిగా చెప్పవచ్చు.
15 ఏళ్ల వయసులో  2005 లో ఢిల్లీలో యాసిడ్ దాడికి గురైన లక్ష్మి అగర్వాల్ పాత్రను ఆధారంగా చేసుకొని ఈ సినిమాను తెరకెక్కించారు. స్టాప్ సేల్ యాసిడ్ అనే నినాదంతో యాసిడ్ ల విక్రయాన్ని నిలిపివేసిన ఘనత ఆమెది. అప్పటి నుంచి యాసిడ్ దాడులు దాదాపుగా తగ్గాయి. తనను ప్రేమించలేదని నయీమ్ ఖాన్ అనే వ్యక్తి లక్ష్మిపై యాసిడ్ దాడి చేశాడు. అయితే ఎంతో మనోవేధనలో కూడా లక్ష్మి దైర్యంగా నిలబడి కొత్త తరహాలో జీవితాన్ని గెలిచి అందరికి ఆదర్శంగా నిలిచింది.ప్రపంచ వ్యాప్తంగా ఆమె యాసిడ్ ఘటనలు జరగకూడదని ప్రచారాలను మీటింగ్ లను నిర్వహించి యాసిడ్ బాధితులకు సైతం అండగా నిలిచింది.  అలాంటి వనిత పాత్రలో దీపిక పదుకొనె నటించి అందరిని ఆశ్చర్యాని కి గురిచేసింది. ఈ చిత్రం లో ప్రముఖ నటుడు విక్రాంత్ మరో ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నాడు.

 

 

రాజి సినిమాతో దర్శకురాలిగా మంచి ప్రశంసలు అందుకున్న మేఘన గుల్జర్ ఆ సినిమాను తెరకెక్కించనున్నారు. ఇకపోతే ఫాక్స్ స్టార్ స్టూడియోస్ తో కలిసి దీపిక సొంతంగా ఈ సినిమాను నిర్మిస్తోంది. వచ్చే ఏడాది జనవరి 10న చాపక్ సినిమా రిలీజ్ కానుంది. ప్రేక్షకులను ఎంతవరకూ మెప్పిస్తుందో చూడాల్సివుంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat