Home / ANDHRAPRADESH / అచ్చెన్న ప్రమాదంపై జగన్ ఆరా..నాకుమాత్రం సీఎం అంటే ప్రేమలేదా: అచ్చెన్నాయుడు

అచ్చెన్న ప్రమాదంపై జగన్ ఆరా..నాకుమాత్రం సీఎం అంటే ప్రేమలేదా: అచ్చెన్నాయుడు

స్పీకర్‌ తమ్మినేని సీతారాం అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సీఎం వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి, మంత్రులు బుగ్గన, కురసాల కన్నబాబు, అనిల్‌ యాదవ్‌, చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి, శాసనసభ ఉప ప్రతిపక్ష నేత అచ్చెన్నాయుడు హాజరయ్యారు. 9రోజులపాటు సమావేశాలు నిర్వహించాలని, ప్రభుత్వం భావిస్తుండగా కనీసం 15 రోజులు నిర్వహించాలని విపక్షం పట్టుపట్టింది. ఈక్రమంలో సుమారు అరగంటకు పైగా జరిగిన బీఏసీ సమావేశంలో నిర్ణయానికొచ్చారు. మొత్తం ఏడు రోజులు సభ నిర్వహించాలని బీఏసీ సమావేశంలో నిర్ణయించారు. దీంతో ఈనెల 9,10,11,12,13,16,17 తేదీల్లో అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. శని, ఆది రెండ్రోజులు అసెంబ్లీకి సెలవు ప్రకటించారు. ఈసమావేశాల్లో పలు అంశాలపై చర్చించేందుకు స్పీకర్‌ నిర్ణయించారు. మరోవైపు సభలో రెడ్‌ లైన్‌ ఏర్పాటు చేస్తారని ప్రచారం సాగింది. రెడ్‌లైన్‌ పెట్టడం ద్వారా ఆ గీత దాటి స్పీకర్‌ పోడియం వైపుకు ఎవరు దూసుకొచ్చినా వారిని సభనుంచి సస్పెండ్‌ చేసేలా ఓ నియమాన్ని పెట్టాలని భావించారు. దీనిపై చర్చ తర్వాత జరగనుంది. బీఏసీ సమావేశానికి ప్రతిపక్షం నుంచి తెలుగుదేశంపార్టీ శాసన సభాపక్ష ఉపనేత అచ్చెన్నాయడికి ఇటీవల జరిగిన కారు ప్రమాదంపై సీఎం జగన్మోహన్‌రెడ్డి బీఏసీలో ఆరా తీపారట. ప్రమాదం గురించి అచ్చెన్నను అడిగి తెలుసుకున్నారు.. ప్రమాదం జరిగిన తీరును సీఎంకు అచ్చెన్నాయుడు వివరించారు. తనకు స్వల్ప గాయాలయ్యాయని, ఇప్పుడు ఫర్వాలేదని అచ్చెన్నాయుడు చెప్పారు. మా సీఎంకు విూపై ఎంతప్రేమ ఉందో చూడండని అచ్చెన్నను ఉద్దేశించి శ్రీకాంత్‌రెడ్డి వ్యాఖ్యానించగా నాకుమాత్రం సీఎం అంటే కోపమా.? ఆయనకు, నాకు వ్యక్తిగతంగా ఏవిూ లేదు.. మాది వేరే పార్టీ, విూది వేరే పార్టీ అంటూ అచ్చెన్న జవాబిచ్చారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat