ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ అధినేత,మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏపీ అసెంబ్లీ సమావేశాల సాక్షిగా సవాలు విసిరారు.
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా వైసీపీకి చెందిన నేతలు హెరిటేజ్ లో మీకు వాటాలున్నాయని ఆరోపించారు. దీనిపై మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందిస్తూ”హెరిటేజ్ సంస్థ మాది కాదు.
దాంట్లో మాకు వాటాలున్నాయని నిరూపిస్తే.. తన ఎమ్మెల్యే పదవీకి రాజీనామా చేస్తానని “ఆయన సవాల్ విసిరారు. ఒకవేళ నిరూపించకపోతే వైఎస్ జగన్మోహాన్ రెడ్డి తన ముఖ్యమంత్రి పదవీకి రాజీనామా చేస్తారా అని ఆయన ఎదురుప్రశ్నించారు.