ప్రస్తుత రోజుల్లో డిజిటల్ టెక్నాలజీ, యూట్యూబ్, ఆండ్రాయిడ్ సేవలు ఎక్కువగా ఉండడంతో ప్రపంచం మొత్తం చిన్న దానిలో కనిపిస్తుంది. ఈరోజుల్లో ఎవరికివారికే కాలి ఉండడంలేదు. దాంతో ఎలాంటి విషయం ఐనాసరే ఆండ్రాయిడ్ లో చూస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే ఎంతటి పెద్ద సినిమా అయినా థియేటర్ కి వెళ్తే టైమ్ వేస్ట్ అన్నట్టుగా టాబ్స్ లోనే చూస్తున్నారు. ఇలా ప్రతి విషయాన్నీ సామన్యుడైనా సరే అరచేతిలో పెట్టుకొని చూసేలా కార్పొరేట్ కంపెనీలు తయారు చేస్తున్నాయి. అయితే ప్రస్తుతానికి నెట్‌ఫ్లిక్స్, అమెజాన్‌ల, ఇండియా కంపెనీ జీ5 లే ఉండగా మరికొద్ది రోజుల్లో ఆపిల్, డిస్నీ కూడా రాబోతున్నాయి. అయితే వీటిపై నిర్మాత సురేష్ బాబు సోమవారం నాడు ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. ఎన్ని ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లు ఉన్నా ఇక్కడ కంటెంట్ ఉన్నవాడే బలవంతుడని అన్నారు. అయితే నిర్మాతగా ఉంటూ మరోపక్క సురేష్ బాబు, అల్లు అరవింద్, దిల్ రాజు ఇలా బడా నిర్మాతలు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్‌ల వంటి ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లు ఏర్పాటు చేయబోతున్నారు. ఇది వస్తే వారికి గడ్డుకాలమనే చెప్పాలి.
