టాలీవుడ్ సెన్సేషనల్ దర్శకుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించబోతున్న చిత్రం ఆర్ఆర్ఆర్. బాహుబలి తరువాత జక్కన్న తీస్తున్న చిత్రం ఇది. దాంతో మరింత ఎక్కువ అంచనాలు పెట్టుకున్నారు ఫ్యాన్స్. దానికి తోడు ఇందులో అల్లూరి సీతారామరాజు పాత్రలో రాంచరణ్ మరియు కొమరం భీమ్ పాత్రలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్నారు. అయితే కొంచెం గ్యాప్ తరువాత ఇప్పుడు రాజమౌళి క్లైమాక్స్ సీన్స్ ప్లాన్ చేసాడు. ఈ క్లైమాక్స్ వైజాగ్ ప్రాతంలో జరుగుతుంది. ఈ మేరకు రాంచరణ్, ఎన్టీఆర్ రావడం జరిగింది. అయితే ఈ క్లైమాక్స్ లో ఎన్టీఆర్ కు సంభందించి కొన్ని సన్నివేశాలు పాడేరు అడవుల్లో చిత్రీకరించనున్నాడు జక్కన్న. ఈ మేరకు అక్కడ టైట్ సెక్యూరిటీ పెట్టాలని నిర్ణయించుకున్నాడు రాజమౌళి.