మైజోరంలో వాలీబాల్ క్రీడాకారిణి మైదానంలో ఆట మధ్యలో తన బిడ్డకు పాలిచ్చే చిత్రం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ చిత్రాన్ని నింగ్లున్ హంగల్ అనే యూజర్ ఫేస్‌బుక్‌లో షేర్ చేయడం జరిగింది. తుయికుమ్ వాలీబాల్ జట్టుకు చెందిన వాలీబాల్ క్రీడాకారిణి లాల్వెంట్లూంగి తన ఏడు నెలల శిశువుతో పాటు ఆటగాళ్ల శిబిరంలో చేరింది. ఆట మధ్య లాల్వెంట్లుంగి తన బిడ్డకు పాలివ్వటానికి చిన్న విరామం తీసుకోవడం జరిగింది. ఆట మధ్య తన 7 నెలల శిశువుకు ఆహారం ఇవ్వడానికి వీరామం తీసుకున్నక్షణం మిజోరామ్ స్టేట్ గేమ్స్ 2019 యొక్క చిత్ర చిహ్నంగా మారింది.