‘పటాస్’ షో ను తమ ప్రతిభతో పాపులర్ చేశారు శ్రీముఖి అండ్ రవి. ఇప్పుడు వీరి స్థానంలోకి ‘జబర్దస్త్’ ఫేమ్ చలాకీ చంటి, వర్షిణి లు వచ్చారు. ఓ కుర్ర యాంకర్ అభిమాని బుగ్గను కొరికి మరీ వైరల్ అవ్వాలని భావించినట్టు ఉంది. అందుకే ఓ ఎపిసోడ్ కు సంబంధించి ఓ ప్రోమోని విడుదల చేశారు. ఇక షోలో భాగంగా యాంకర్లు కొన్ని ప్రశ్నలు అడిగి.. స్టూడెంట్స్ తో సమాధానాలు చెప్పేస్తుంటారు అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో వారు అడిగిన ఓ ప్రశ్నకి సమాధానం చెప్పడానికి ఓ అబ్బాయి నిలుచున్నాడు. ఆ సమయంలో వర్షిణి.. ‘ చాలా క్యూట్ గా ఉన్నాడు అంటూ స్టేజ్ పైకి పిలిచింది. అక్కడితో ఆగకుండా.. అతడి బుగ్గలు పట్టుకుని గిల్లడం తో పాటు… గట్టిగా ఆ కుర్రాడి బుగ్గను కోరికేసింది. దీంతో అక్కడున్నవారంతా షాకయ్యారు. ఎపిసోడ్ కు హైప్ తీసుకురావాలి అనే ఉద్దేశంతో అలా ప్రోమోని కట్ చేసి ఉంటారు మేకర్స్. అయితే ‘క్రేజ్ కోసం ఇంత దిగజారాలా’ అంటూ వర్షిణి పై ప్రస్తుతం ట్రోలింగ్ జరుగుతుంది.