అటు ఏపీ ఇటు తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాలకు సాగునీరందించే నాగార్జున సాగర్ ప్రాజెక్టు నేటితో ఆరవై నాలుగేళ్లు పూర్తి చేసుకుంది.
నాగార్జున సాగర్ డ్యాం కు ఇదే రోజున శంకుస్థాపన చేశారు. అప్పటి ఉమ్మడి ఏపీ.. ఇప్పటి ఏపీ,తెలంగాణలను సస్యశ్యామల చేసేందుకు సరిగ్గా ఆరవై నాలుగేళ్ల కిందట అంటే 1955 డిసెంబర్ పదో తారీఖున అప్పటి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ శంకు స్థాపన చేశారు.
ఆ తర్వాత 1967లో మాజీ ప్రధాని దివంగత ఇందిరా గాంధీ ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. డ్యాంతో పాటుగా జలవిద్యుత్ కేంద్రాన్ని కూడా అప్పట్లో నిర్మించారు. ఈ ప్రాజెక్టు సాగునీటి ప్రాజెక్టుగానే కాకుండా మంచి పేరున్న పర్యాటక క్షేత్రంగా పేరు గాంచింది.