సన్నబియ్యం పంపిణీ విషయమై అసెంబ్లీ లో టీడీపీ నుంచి ఎదురైన ప్రశ్నలకు బదులిస్తూ ఏపీ సీఎం జగన్ తాను ఎన్నికల ముందు విడుదల చేసిన మ్యానిఫెస్టో తనకు ఖురాన్, భాగవతగీత, బైబిల్ అన్ని అదేనని అన్నారు.మ్యానిఫెస్టో లోని హామీలను అమలు చేస్తానని ప్రజలకు మాట ఇచ్చి ఓట్లు అడిగామని వాటిని అమలు చేసి తీరుతామని,మా మ్యానిఫెస్టో లో సన్నబియ్యం పంపినీ ప్రస్తావన లేదని కానీ అవసరాల నిమిత్తం పేద ప్రజలందరికి నాణ్యమైన సన్నబియ్యం పంపిణీ చూసేలా నిర్ణయం తీసుకున్నామని అన్నారు. పైలట్ ప్రాజెక్టుగా శ్రీకాకుళం జిల్లాలో అమలు చేస్తున్నామని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ తన ఎన్నికల మానిపెస్టోని చెత్తబుట్టలో పడేస్తే తాము మాత్రం దానిని ఒక పవిత్ర గ్రంధంగానే భావిస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. టిడిపి వారు కనీసం తమ మానిపెస్టోని ఎక్కడ పారేశారో, ఎందుకు వెబ్ సైట్ లో నుంచి తీసేశారో వారికే తెలియాలని అన్నారు. తాము మాత్రం మానిపెస్టోలోనివి మాత్రమే కాకుండా, మానిపెస్టోలో లేనివాటిని కూడా అమలు చేస్తున్నామని అన్నారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం ఖర్చు చేసినదానికన్నా 1400 కోట్ల రూపాయలు అదికంగా ఖర్చు చేస్తున్నామని జగన్ తెలిపారు.
